Asifabad: బెజ్జూర్‌లో అక్రమ పశువుల రవాణా భగ్నం ఆరుగురి అరెస్ట్!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 41 పశువులను స్వాధీనం చేసుకున్న ఎస్సై.

SRINIVAS, KOUTALA
Published on: 30 Aug 2026 1:35 PM IST
Asifabad
X

Asifabad: బెజ్జూర్‌లో అక్రమ పశువుల రవాణా భగ్నం ఆరుగురి అరెస్ట్!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సుస్మీర్ గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు మహారాష్ట్రలో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, వాటిని జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం బెజ్జూర్ ఎస్సై ఎం.డి. సర్తాజ్ పాషాకు అందింది.

వెంటనే బెజ్జూర్ ఎస్సై ఎం.డి సర్తాజ్ పాషా తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పశువులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి మొత్తం 41 పశువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పశువుల్లో 10 ఎద్దులు, 21 ఆవులు మరియు 10 దూడలు ఉన్నాయి అని నిర్ధారించారు.

నిందితులు మహారాష్ట్రలో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి వాటిని జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్‌కు తరలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేసు నమోద చేసుకును స్వాధీనం చేసుకున్న పశువులు పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story