Kagaznagar: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ నితికా పంత్ తనిఖీలు
Kagaznagar: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. కాగజ్‌నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్‌పేట్‌లలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ నితికా పంత్.
Kagaznagar: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ నితికా పంత్ తనిఖీలు
కాగజ్నగర్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పి నితికా పంత్ జిల్లాలో క్షేత్రస్థాయిలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
కాగజ్నగర్ పెద్దవాగు, దహెగం, పెంచికల్పేట్ ప్రాంతాల్లోని వరద ఉధృతి గల వాగులు, వంతలను పరిశీలించి పోలీస్ అధికారులకు, ఎస్ డి ఆర్ ఎఫ్ రెస్క్యూటిమ్ బృందాలకు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచనలు అందించారు.
లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, రోప్స్ అందుబాటులో ఉంచుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తూ విధులను వర్తించాలని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ భద్రత చర్యలు కట్టుదిట్టం చేశామని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రమాదకర వాగులు వంతెనల వద్ద పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదుర్కొన్నచో వెంటనే100/ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలని పేర్కొన్నారు.




