Asifabad: చింతలమానేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించిన సబ్ కలెక్టర్ హర్ష చౌదరి.
Asifabad: చింతలమానేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి పర్యటించారు. తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు.
చింతలమానేపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా భూభారతిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలను సబ్ కలెక్టర్ హర్ష చౌదరి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా భూభారతి చట్టం కింద నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
భూములకు సంబంధించిన దరఖాస్తులు, సాదా బైనామాలు, వారసత్వ దరఖాస్తులు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ తదితర పెండింగ్ ఫైళ్ల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సబ్ కలెక్టర్ హర్ష చౌదరి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
రైతులు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, గడువులోగా పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని తహసిల్దార్, ఆర్ఐ, జీపీవోలను ఆదేశించారు.




