Asifabad: రోడ్డు నిర్మించాలని కోరుతూ 40 కిలోమీటర్లు పాదయాత్ర

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల గ్రామస్తులు రోడ్డు కోరుతూ 40 కి.మీ. పాదయాత్ర చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 7 Sept 2026 4:27 PM IST
Asifabad
X

Asifabad: రోడ్డు నిర్మించాలని కోరుతూ 40 కిలోమీటర్లు పాదయాత్ర

ఆసిఫాబాద్: తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 40 కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేపట్టారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల గ్రామం నుంచి బయలుదేరిన గ్రామస్తులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని వాపోయారు.

రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతోనే పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని గ్రామస్తుడు దౌలత్ రావు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. రోడ్డు నిర్మాణం జరిగే వరకు అధికారులు, ప్రజాప్రతినిధులను గ్రామంలోకి అనుమతించమని స్పష్టం చేశారు..

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story