Asifabad: బారేగుడలో ఘనంగా అయ్యప్ప స్వాముల మెట్ల మడిపూజ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బారేగుడలో అయ్యప్ప స్వాములు 18 మెట్లకు ప్రతీకగా మెట్ల మడిపూజ నిర్వహించారు.
Asifabad: బారేగుడలో ఘనంగా అయ్యప్ప స్వాముల మెట్ల మడిపూజ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి బెజ్జూర్ కౌటాల తదితర మండలాలలో అయ్యప్ప స్వామి మండల మాలధారణ తీసుకున్న స్వాములు భక్తి శ్రద్ధలతో మడి పూజలు నిర్వహిస్తున్నారు. చింతలమానేపల్లి మండలం బారేగుడలో అయ్యప్ప స్వాముల మెట్ల మడిపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
చింతలమానేపల్లి మండలం బారేగుడలో అయ్యప్ప స్వామి మాలధారణ తీసుకున్న సోన్లే వినోద్ స్వామి ఇంటి వద్ద అయ్యప్ప స్వాములు మెట్ల మడిపూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు 18 మెట్లకు ప్రతీకగా మడిపూజ చేసి, అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
శబరిమల యాత్రకు వెళ్లే ముందు నిర్వహించే ఈ మెట్ల మడిపూజకు ప్రత్యేక విశిష్టత ఉందని గురుస్వాములు తెలిపారు. భక్తి గీతాలు, అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గురుస్వాములు కుంసాల విజయ్ గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




