Bejjur: బెజ్జూర్‌లో అక్రమ పశువుల రవాణాపై పోలీసుల దాడి; ఏడుగురు అరెస్ట్

Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో అక్రమ పశువుల రవాణా ముఠాను పట్టుకున్న పోలీసులు; 18 పశువులు, 4 వాహనాలు, రూ.50 వేల నగదు స్వాధీనం.

SRINIVAS, KOUTALA
Published on: 22 Nov 2026 8:23 PM IST
Bejjur
X

Bejjur: బెజ్జూర్‌లో అక్రమ పశువుల రవాణాపై పోలీసుల దాడి; ఏడుగురు అరెస్ట్

బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ పశువుల రవాణాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాను పట్టుకుని 18 పశువులు, 4 వాహనాలు, 6 సెల్ ఫోన్లు, రూ.50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగవెల్లి గ్రామ శివారులో అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ కె. రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుళ్లు మల్లేష్, మహేందర్, పురుషోత్తంలు దాడులు చేపట్టారు.

ఈ సందర్భంగా రెండు మోటార్ సైకిళ్లు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక అశోక్ లేలాండ్ వాహనం, ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించి కొందరు పరారవగా, ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వాహనాలను తనిఖీ చేయగా 9 ఎద్దులు, 9 ఆవులు కలిపి మొత్తం 18 పశువులను ఎలాంటి అనుమతులు లేకుండా, అత్యంత క్రూరంగా కిక్కిరిసిన స్థితిలో తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఈ ఘటనలో 18 పశువులతో పాటు 4 వాహనాలు, 6 సెల్ ఫోన్లు, రూ.50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న మిగిలిన వ్యక్తుల కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ పశువుల రవాణాకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బెజ్జూర్ ఎస్ఐ కె. రమేష్ హెచ్చరించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA