Bejjur: పాపన్పేట్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్: గుడుంబా స్వాధీనం
Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పాపన్పేట్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి గుడుంబా స్థావరాలను ధ్వంసం చేశారు.
Bejjur: పాపన్పేట్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్: గుడుంబా స్వాధీనం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలం పాపన్ పేట్ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అక్రమ గుడుంబాపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపన్ పేట్ గ్రామంలో ఎస్ఐ కె. రమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అక్రమంగా తయారు చేస్తున్న గుడుంబాపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 లీటర్ల బెల్లం పానకాన్ని అంటే బెల్లం మిశ్రమాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించి 20 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయకూడదని, OTP లు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.
అదేవిధంగా మోటార్ వెహికల్ చట్టం నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గ్రామ ప్రజలు పోలీసులకు సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్ఐ కె. రమేష్ కోరారు.




