Asifabad: బాలల రక్షణపై బెజ్జూర్ పోలీసుల విస్తృత అవగాహన!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నివారణపై భరోసా బృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

SRINIVAS, KOUTALA
Published on: 16 Oct 2026 2:48 PM IST
Asifabad
X

Asifabad: బాలల రక్షణపై బెజ్జూర్ పోలీసుల విస్తృత అవగాహన!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో మానవ అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం (POCSO Act) తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాథోడ్ బిక్కులాల్, స్నిగ్ధ సపోర్ట్ పర్సన్, సరిథా సపోర్ట్ పర్సన్, దినేష్ పీసీతో పాటు భరోసా బృందం సభ్యులు పాల్గొని మానవ అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ, లైంగిక వేధింపుల నుంచి పిల్లలను కాపాడటం, బాధితులకు అందుబాటులో ఉన్న సహాయ సేవలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు 1930 నంబర్‌కు, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

కార్యక్రమంలో బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య, కానిస్టేబుళ్లు మహేందర్, సంజీవ్ పాల్గొన్నారు. బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA