Bellampalle: నిజాయితీ చాటుకున్న వ్యక్తి - పోలీసులకు పుస్తెలతాడు అందజేత
Bellampalle: బెల్లంపల్లిలో దొరికిన పుస్తెలతాడును పోలీసులకు అప్పగించిన నిజాయితీపరుడు. పోగొట్టుకున్న వారు తగిన ఆధారాలతో వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచన.
Bellampalle: నిజాయితీ చాటుకున్న వ్యక్తి - పోలీసులకు పుస్తెలతాడు అందజేత
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పుస్తెలతాడు లభ్యమైంది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గర్ల్స్ హైస్కూల్ వద్ద ఓ వ్యక్తికి పుస్తెలతాడు దొరికింది. దానిని తన వద్ద ఉంచుకోకుండా నిజాయితీగా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లభ్యమైన పుస్తెలతాడులో రెండు బంగారు పుస్తెలు, ఒక బంగారు గొట్టం, నాలుగు బంగారు గుండ్లు ఉన్నాయి. అయితే పుస్తెలతాడుకు ఉన్న చైన్ రోల్డ్ గోల్డ్‌తో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఆభరణాన్ని బెల్లంపల్లి వన్‌టౌన్ SHO కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రపరిచారు. ఈ ఆభరణాన్ని పోగొట్టుకున్న వారు తగిన ఆధారాలతో బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.
సంప్రదించాల్సిన నంబర్లు:
CI: 8712656559
SI: 9440521677




