Bellampalli: ఆషాఢ బోనాల సందడి – బోనం ఎత్తిన చైర్‌పర్సన్ స్వాతి!

Bellampalli: బెల్లంపల్లి రడగంబాల బస్తీలో అంగరంగ వైభవంగా ఆషాఢ బోనాలు. స్వయంగా బోనం ఎత్తి పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు.

PRATHAP, BELLAMPALLI
Published on: 9 Aug 2026 4:49 PM IST
Bellampalli
X

Bellampalli: ఆషాఢ బోనాల సందడి – బోనం ఎత్తిన చైర్‌పర్సన్ స్వాతి!

Bellampalli: బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో ఆషాడ మాసం బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి, శ్రీ దామెర విజయ-శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి, శ్రీ దావ స్వాతి-రమేష్ బాబు గారు తోటి కౌన్సిల్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్థానిక మహిళలతో కలిసి స్వయంగా బోనం ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పెరగాలని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ బండి ప్రభాకర్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, బస్తీ మహిళలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story