Bellampalli: కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!
Bellampalli: బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాంగ్రెస్ నాయకుల విమర్శలను తిప్పికొట్టిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
Bellampalli: కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!
బెల్లంపల్లి: తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని వాటికి ఆధారాలు లేవని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు గాను పత్రిక సమావేశం నిర్వహించిన బెల్లంపల్లి బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే -దుర్గం చిన్నయ్య
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు అభివృద్ధి చేసిన ఆధారాలు ఏమీ లేవని, అందుకే వారు తమ సవాలును స్వీకరించలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింధని. మేము ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశామో అవన్నీ కూడా అతిత్వరలో, కొద్ది రోజులలో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించబోతున్నాం.
పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరితో పాటు బెల్లంపల్లి పట్టణంలోని అన్ని పార్టీల పెద్దలను, విద్యావంతులను, మేధావులను, కార్మికులను, కర్షకులను అందరినీ పిలిచి.. మేము ఈ 10 సంవత్సరాలలో ఏది అభివృద్ధి చేశామో కళ్లకు కట్టినట్లు వివరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.
అయితే వారు మాట్లాడుతూ.. తమను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడామని అన్నారు. ఆ రోజు మేము కళ్లకు గంతలు కట్టుకుని, వర్షాకాలంలో గుంతల వల్ల ఒక మహిళ పడి గాయపడితే.. ఆ గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిరసన తెలపడం జరిగిందని...
ఈ నిరసన రోడ్ల అద్వాన స్థితి ఎమ్మెల్యే గారికి కనపడడం లేదా అనే ఉద్దేశంతోనే ఆ నిరసన తెలిపాం తప్ప, ఎక్కడా కూడా వారిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కానీ వారు మాత్రం ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడారు. ఆ రీతిని ప్రజలందరూ గమనించారు, వారి వీడియోను కూడా బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ చూశారు.
ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో మేమేమీ చేయలేదని వారు అంటున్నారు. కానీ, శాంపిల్‌గా కొన్ని విషయాలను ఈ రోజు మీడియా ద్వారా బెల్లంపల్లి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం.
ముఖ్యంగా 40–50 సంవత్సరాల నుండి బెల్లంపల్లిలో నివసిస్తున్న రిటైర్డ్ కార్మికులు, కార్మికేతరులు సింగరేణి స్థలాలలో, ఎస్ఆర్టి క్వార్టర్లలో నివాసం ఉంటూ పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టాలు లేకపోవడంతో బెల్లంపల్లి పట్టణం ఎక్కడా అభివృద్ధి చెందలేదు, వ్యాపారాలు పెట్టడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఆ పరిస్థితుల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వద్దకు నాలుగు సార్లు వెళ్ళి విజ్ఞప్తి చేశాం. వారి దయ, కృషితో బెల్లంపల్లి పట్టణంలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. గతంలో పట్టాలు లేనప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మంచిర్యాలకో లేదా వేరే ప్రాంతాలకో వెళ్లి అక్కడ సొంత భవనాలు కట్టుకునేవారు. కానీ పట్టాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు




