Bellampalli: నెన్నెల, కన్నెపల్లి MRO కార్యాలయాలకు నిధులు మంజూరు

Bellampalli: బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, కన్నెపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలకు రూ. 4.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.

Venkata Thirumala
Published on: 11 Aug 2026 5:55 PM IST
Bellampalli
X

Bellampalli: నెన్నెల, కన్నెపల్లి MRO కార్యాలయాలకు నిధులు మంజూరు

బెల్లంపల్లి: నెన్నెల, కన్నెపల్లి మండలాలకు తహసీల్దార్‌ (MRO) కార్యాలయ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో మండలానికి రూ.2.25 కోట్ల చొప్పున మొత్తం రూ.4.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎంవీ నర్సింగరావు, మంచిర్యాల జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు బొమ్మెన హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నెన్నెల, కన్నెపల్లి మండలాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story