Bellampalli: బెల్లంపల్లి ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల దౌర్జన్యం
Bellampalli: బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రిఫర్ చేసిన రోగిని తరలించే క్రమంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు గిరాకీ కోసం గొడవపడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.
Bellampalli: బెల్లంపల్లి ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల దౌర్జన్యం
బెల్లంపల్లి: రిఫర్ చేసిన రోగి ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవర్లు గొడవలకు దిగిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఈరోజు ఒక రోగిని మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
రోగిని అంబులెన్స్‌లో ఎక్కించి అత్యవసరంగా తరలించాల్సిన తరుణంలో, "నాకే గిరాకీ వచ్చింది, నేను తీసుకెళ్తాను" అంటూ అంబులెన్స్ డ్రైవర్లు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. క్షణాల మీద స్పందించాల్సిన సమయంలో డ్రైవర్లు పాయింట్ల కోసం రోగిని వెయిటింగ్ లో పెట్టి గొడవ పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ అంబులెన్స్ లు పాయింట్లుగా ఏర్పడి, తమ వాటాల కోసం ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఈ అంబులెన్స్ సిండికేట్ వ్యవహారంపై డ్రైవర్ల వర్గాల నుంచే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రి పరిధిలో ఒక పాయింట్ వద్ద అంబులెన్స్ నిలపాలంటే వారి వద్ద నుండి యూనియను పేరుతో వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోందని, కొందరు అంబులెన్స్ యజమానులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ... పరిమితి లేకుండా చట్టబద్ధత లేకుండా అంబులెన్స్ నిలపాలి అంటే అంబులెన్స్ నిర్వాహకులు యజమానుల వద్ద నుండి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని యజమానులు వాపోతున్నారు... వీరి మధ్య ఒప్పంద గొడవల వల్ల ఆస్పత్రికి వచ్చిన రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు వాపోతున్నారు...
అత్యవసర సేవలందించాల్సిన అంబులెన్స్ రంగాన్ని వ్యాపారంగా మార్చి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంపై బెల్లంపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ ల అరాచకాలను అరికట్టాలని, అక్రమ పద్ధతులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలకు ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా న్యాయబద్ధమైన రేటుకి సేవలందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.




