Bellampalli: బెల్లంపల్లిలో అర్ధరాత్రి వైన్ షాపుల విక్రయాలు
Bellampalli: బెల్లంపల్లిలో రాత్రి 11 దాటినా సాగుతున్న మద్యం విక్రయాలు. ఆర్‌ఆర్ వైన్స్ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారుల నిమ్మకు నీరెత్తిన తీరు. చర్యలకు స్థానికుల డిమాండ్.
Bellampalli: బెల్లంపల్లిలో అర్ధరాత్రి వైన్ షాపుల విక్రయాలు
బెల్లంపల్లి: దసరా పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బెల్లంపల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా రాత్రి 10 గంటల తర్వాత వైన్‌షాపులు మూసివేయాల్సి ఉండగా, పట్టణంలోని ఆర్‌ఆర్ వైన్స్‌లో రాత్రి 11 గంటలు దాటినా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి..
పండుగ నేపథ్యంలో వైన్‌షాపులకు అర్ధరాత్రి వరకు విక్రయాలు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అనుమతులు ఏమైనా ఇచ్చిందా? ఇచ్చినట్లయితే వాటికి సంబంధించిన నిబంధనలు ఏమిటి? అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. మరోవైపు, నిర్ణీత సమయం దాటినా అమ్మకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వైన్‌షాపుల నిర్వహణపై ఎక్సైజ్ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపిస్తున్న ప్రజలు..
దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు కుటుంబాలతో బయటకు వస్తున్న ప్రజలకు మద్యం సేవించిన కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎక్సైజ్, పోలీసు శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బెల్లంపల్లిలోని ఆర్‌ఆర్ వైన్స్‌లో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా అమ్మకాలు జరపడం ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వైన్‌షాపుల పనివేళలపై స్పష్టత ఇవ్వడంతో పాటు, నిబంధనల ఉల్లంఘన జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




