Bellampalli: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో అట్టహాసంగా రావణ దహనం

Bellampalli: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఘనంగా రావణ దహనం. ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ దంపతులు హాజరు. దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 20 Oct 2026 11:35 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో అట్టహాసంగా రావణ దహనం

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియం మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి గడ్డం సరోజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణాసురుడి ప్రతిమను దహనం చేసి విజయదశమి వేడుకల్లో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని తెలిపారు. రావణాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులను అభినందించారు.

దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావస్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.