Bellampalli: బెల్లంపల్లిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

Bellampalli: బెల్లంపల్లి కాంట చౌరస్తాలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి కలిసి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 28 Jun 2026 2:39 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి: పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బెల్లంపల్లి శాసనసభ్యులు, గడ్డం వినోద్ వెంకటస్వామి గారి తో కలిసి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.శ్రీ.దావ స్వాతి-రమేష్ బాబు గారు..

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పిల్లలు పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 0-5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని పిలుపునిచ్చారు. పోలియో రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా మనం చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలుగుతామన్నారు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ఈ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నాయకులు, వైద్య సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story