Bellampalli: అధ్యాపకులు లేరని గోడ దూకిన హాస్టల్ విద్యార్థులు!
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ కళాశాలలో అధ్యాపకుల కొరతపై విద్యార్థుల ఆందోళన. సమస్య పరిష్కారానికి ప్రిన్సిపల్ హామీ.
Bellampalli: అధ్యాపకులు లేరని గోడ దూకిన హాస్టల్ విద్యార్థులు!
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధ్యాపకులు లేకపోవడంతో తరగతులు సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ.. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇంటర్ విద్యార్థులు తెల్లవారుజామున కళాశాల గోడ దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్‌తో విద్యార్థులు చర్చించారు. సమస్య పరిష్కారానికి రెండు రోజుల సమయం ఇవ్వాలని ప్రిన్సిపల్ కోరడంతో.. హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.
Next Story




