Bellampally: బియ్యం ధరల నియంత్రణకు చర్యలు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
Bellampally: బెల్లంపల్లిలో ప్రత్యేక బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను ప్రారంభించిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్. నిర్ణీత ధరలకే విక్రయించాలని ఆదేశం.
Bellampally: బియ్యం ధరల నియంత్రణకు చర్యలు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి: ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బెల్లంపల్లి మండల కేంద్రంలోని బెల్లంపల్లి డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, తహసీల్దార్ కృష్ణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయించాలని కోరారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయాలు జరిగేలా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని, వ్యాపారులు, ట్రేడర్లు అధికారులకు సహకరించాలని సూచించారు.
అవుట్‌లెట్‌లో విక్రయించాల్సిన బియ్యం ధరలను కలెక్టర్ వెల్లడించారు. 26 కిలోల బి.పి.టి. కొత్త బియ్యం బ్యాగ్ రూ.1,326కు, పాత బియ్యం బ్యాగ్ రూ.1,612కు, హెచ్ఎంటీ స్టీమ్ బియ్యం బ్యాగ్ రూ.1,872కు, జై శ్రీరామ్ పాత బియ్యం బ్యాగ్ రూ.2,028కు విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




