Bellampalli: బెల్లంపల్లిలో నకిలీ డెత్ సర్టిఫికెట్లపై న్యాయ విచారణ జరిపించాలి!
Bellampalli: బెల్లంపల్లి మండలంలో వెలుగుచూసిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.
Bellampalli: బెల్లంపల్లిలో నకిలీ డెత్ సర్టిఫికెట్లపై న్యాయ విచారణ జరిపించాలి!
మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలంలోనీ భూదకుర్ద్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ బెల్లంపల్లి మండలంలో వెలుగుచూసిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టి, ఈ అక్రమాలకు పాల్పడిన నాయకులను వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.
బెల్లంపల్లి మండలంలోనీ భూదకుర్ద్ మరియు పెరకపల్లి లో నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ అక్రమాల వెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ రికార్డుల విశ్వసనీయతను దెబ్బతీసే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని కొత్త చట్టాలు ఒక బెల్లంపల్లి లో మాత్రమే అమలు అవుతున్నాయని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బెల్లంపల్లి నియోజకవర్గం లోనీ బెల్లంపల్లి మండలంలో వేరే జిల్లా వాళ్లకి డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనీ దీనికి కారణం శాసనసభ్యులు లోకల్ లో లేకపోవడమే అని అసలు నియోజకవర్గాన్ని తన అనుచరులకు దోచుకొమ్మని వదిలేసి తను హైదరాబాద్ కి పరిమితం అయ్యాడు అని విమర్శించారు.
ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ల వెనుక ఉన్న తన అనుచరులను కాంగ్రెస్ నాయకులను కాపాడుకోవడానికి కింది స్థాయి ఉద్యోగులను బలి చేశారని విమర్శించారు ఇప్పటికైనా న్యాయ విచారణ జరిపి బాధ్యులైన నాయకులను కటినంగా శిక్షించాలని లేని యెడల భారతీయ జనతా పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ జిల్లా కార్యదర్శులు రాచర్ల సంతోష్ సంజీవ రావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నగునూరి సుధీర్ గౌడ్ bjym జిల్లా అధ్యక్షులు శివ కృష్ణ బీజేపీ భూదకుర్ద్ వార్డ్ మెంబర్ చంద్రగిరి సంపత్ మండల ప్రధాన కార్యదర్శులు నగేశ్ సాయిరాం మాజీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ bjym జిల్లా ప్రధానకార్యదర్శి ప్రదీప్ నాయకులు దుర్గా చరణ్ సతీశ్ సాయి తదితరులు పాల్గొన్నారు.




