Chennur: ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నేతలు!

Chennur: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చెన్నూరులో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 27 Oct 2026 1:55 PM IST
Chennur
X

Chennur: ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నేతలు!

Chennur: చెన్నూరు ప్రెస్ క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గర్రెపల్లి వెంకట నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ప్రధాని మోదీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటూ, చేసిన వ్యాఖ్యలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, దేశ ప్రధానిపై మాట్లాడే విషయంలో హుందాతనం పాటించాలని బీజేపీ నాయకులు హితవు పలికారు.

ప్రధానమంత్రి పట్ల గౌరవం ఉండాలని, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రధాని మోదీపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాయిత వెంకటేష్ , మధురాజ్, ప్రసాద్ శ్రావణి, చిరంజీవి, అడపా శ్రీనివాస్, మణికరౌతు శంకర్, చాకటి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR