Mancherial: మంత్రి వివేక్ అండతోనే ఆదివాసీలపై ఫారెస్ట్ దాడులు: బీజేపీ!

Mancherial: మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ అండతోనే అటవీ అధికారులు ఆదివాసీ గిరిజన పట్టు రైతులు, కాపరులపై పాశవిక దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధ్వజమెత్తారు.

RAJENDER, CHENNUR
Published on: 24 Oct 2026 7:11 PM IST
Mancherial
X

Mancherial: మంత్రి వివేక్ అండతోనే ఆదివాసీలపై ఫారెస్ట్ దాడులు: బీజేపీ!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకట్ స్వామి అండదండలతోనే ఫారెస్ట్ అధికారులు ఆదివాసి గిరిజనులపై పాషవిక దాడులు చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.

కోటపల్లి మండలంలోని కావర్ కొత్తపల్లిలో దసిలీ పంట సాగు చేస్తున్న రైతుపై ఫారెస్ట్ అధికారులు ఇటీవల దాడి చేసి చితకబాదడంతో గాయపడిన ఆదివాసి రైతును మరియు ఆల్గాం గ్రామంలో ఇటీవల ఫారెస్ట్ అధికారులు మేకల కాపరులను ఆదివాసులనీ కూడా చూడకుండా అడవి శాఖ అధికారి చితక బాదిన సంఘటనలో గాయపడ్డ బాధితులను భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గo అశోక్ తో కలిసి బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 దశాబ్దాలుగా చెన్నూరు కేంద్రంగా అటవీ ప్రాంతంలో దసలి పంట సాగు జరుగుతుందని దసలి సాగుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ టస్సర్ కార్యాలయాల పర్యవేక్షణలో సాగు జరుగుతుందని టస్సర్ కార్యాలయంలోనే రైతులు పంటను విక్రయించడం జరుగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఫారెస్ట్ అధికారులు సుమారు 500 మంది ఆదివాసి రైతులను దసలి పంట సాగు చేయకుండా అడ్డుకోవడమే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

ఫారెస్ట్ అధికారులు దాడికి గురి అయిన రైతు వెంట ఆసుపత్రికి వెళ్ళినందుకు కక్ష సాధింపుగా పది మంది రైతుల పంటను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఫారెస్ట్ ఇలాంటి పాషవిక దాడులు చేస్తున్న వారి పై కేసులు నమోదు చేయకుండా వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వివేక్ వెంకట్ స్వామి బాసటగా నిలవడం శోచనీయమని ఆయన అన్నారు.

ఇటీవల ఆల్గమ గ్రామ పరిధిలో గల అడవిలో మేకలను మేపుతున్న ఒక గిరిజన రైతుపై మరియు ఒక గొర్ల కాపరి పై ఫారెస్ట్ అధికారులు పాషవికంగా దాడి జరిపారని ఈ సంఘటనలో వారు కేసు నమోదు చేయకుండా ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి గురైన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.

ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు వివేక్ వెంకట్ స్వామి కి చిత్తశుద్ధి ఉంటే తక్షణం రెండు సంఘటనలో బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై సుమోటోగా కేసులు నమోదు చేసి తక్షణం వారిని విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు స్వప్న, పున్నo చంద్, భాజపా జిల్లా కార్యదర్శి మంత్రి సురేఖ రామయ్య, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెద్దింటి లక్ష్మణ్, గిరిజన మోర్చా నాయకులు ఆలం బాపు, చాకేటి శ్యామ్, బిజెపి సీనియర్ నాయకులు కాసెట్టి నాగేశ్వరరావు, కోటపల్లి మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR