Bellampally: సింగరేణి బకాయిలపై బెల్లంపల్లిలో నేడు బీజేపీ భారీ ధర్నా!
Bellampally: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి కార్మికుల బకాయిలపై బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ధర్నా. కార్మికులను కలిసి పాల్గొనాలని కోరిన నేతలు.
Bellampally: సింగరేణి బకాయిలపై బెల్లంపల్లిలో నేడు బీజేపీ భారీ ధర్నా!
Bellampally: సింగరేణి కార్మికులకి అండగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ రావ్ గారి ఆధ్వర్యంలో తేదీ 30.09.2026 బుధవారం రోజున CCC x రోడ్డు HP పెట్రోల్ పుంపు వద్ద ఉదయం 10 గంటల నుండి ధర్నా కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి మద్దతుగా పాల్గొనవలసిందిగా బెల్లంపల్లి పట్టణ సమీపంలో ఉన్న శాంతిగనీ మైన్ వద్దకు ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమరాజుల శ్రీదేవి మరియు జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ స్థానిక నాయకులతొ కలిసి వెళ్లి కార్మికులను కలిసి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, కుమార్ బెల్లంపల్లి మండల అధ్యక్షులు ఉప సర్పంచ్ గజ్జెల్లి రాజ్ కుమార్ మహిళా మోర్చా నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ అడ్వకేట్ నల్లుల సంగీత గారు బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు బాసబోయిన యుగంధర్ బి ఎం ఎస్ నాయకులు శ్రీనివాస రాజు నాయకులు నర్సయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




