Chennur: చెన్నూరులో బీజేపీ స్వచ్ఛ భారత్.. వరదాచార్యులకు నివాళులు!

Chennur: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా చెన్నూరులో బీజేపీ స్వచ్ఛ భారత్ వానమామలై వరదాచార్యుల విగ్రహ పరిసరాల శుభ్రత.. క్షీరాభిషేకం చేసిన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్.

RAJENDER, CHENNUR
Published on: 3 Oct 2026 9:21 PM IST
Chennur
X

Chennur: చెన్నూరులో బీజేపీ స్వచ్ఛ భారత్.. వరదాచార్యులకు నివాళులు!

చెన్నూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 76 వ పుట్టినరోజును పురస్కరించుకొని బిజెపి శ్రేణులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చెన్నూర్ పట్టణంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణంలోని అభినవ పోతన వానమామలై వరదాచార్యుల విగ్రహం వద్ద పేరుకుపోయిన చెత్త చేదారం, పిచ్చి మొక్కలను శుభ్రం చేశారు.

అనంతరం వరదాచార్యుల విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి జాతీయ శాఖ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులు సేవాహి సంకల్ప్ అనే నినాదంతో దేశంలోని అన్ని ప్రాంతాలలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సేవాహి సంకల్ప్ కార్యక్రమంను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 25 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అలాగే భారత దేశ ప్రధానమంత్రిగా సేవలందించిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా చెన్నూరు పట్టణంలో సేవలో నా భాగస్వామ్యం అనే కార్యక్రమాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు చెన్నూరు పట్టణంలో నిర్వహించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఏతం శివకృష్ణ, గర్రెపల్లి శాంతా వెంకట నరసయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత వెంకటేష్, పట్టణ నాయకులు ఆడప శ్రీనివాస్, ప్రసాద్, తగరం మధురాజ్, చటారి వెంకటేష్, శ్యాం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR