Mancherial: లక్షెట్టిపేటలో లైబ్రరీ, ఫైర్‌స్టేషన్ కోసం యువకుడి ఆమరణ నిరాహార దీక్ష!

Mancherial: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో లైబ్రరీ, ఫైర్‌‌స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ చౌక్‌లో బొప్పు సతీష్ ఆమరణ నిరాహార దీక్ష.

KIRAN, LAXETTIPET
Published on: 5 Oct 2026 11:33 AM IST
Mancherial
X

Mancherial: లక్షెట్టిపేటలో లైబ్రరీ, ఫైర్‌స్టేషన్ కోసం యువకుడి ఆమరణ నిరాహార దీక్ష!

Mancherial: పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా లైబ్రరీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల భద్రత కోసం ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బొప్పు సతీష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

లక్షెట్టిపేట గాంధీ చౌక్‌లో ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

పట్టణంలో లైబ్రరీ లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర సేవలు అందించేందుకు ఫైర్‌స్టేషన్ అవసరమని బొప్పు సతీష్ పేర్కొన్నారు.

లక్షెట్టిపేటలో లైబ్రరీ, ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

KIRAN, LAXETTIPET

KIRAN, LAXETTIPET