Bellampalli: నైతిక హక్కు లేని వ్యక్తి కాంగ్రెస్ నేత రాజేష్ శ్రావణ్ ఫైర్

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బిఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య రాజకీయం వేడెక్కింది.

PRATHAP, BELLAMPALLI
Published on: 5 Aug 2026 5:13 PM IST
Bellampalli
X

Bellampalli: నైతిక హక్కు లేని వ్యక్తి కాంగ్రెస్ నేత రాజేష్ శ్రావణ్ ఫైర్

బెల్లంపల్లి: బెల్లంపల్లిలో రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి. తనపై కాంగ్రెస్ నేత కుంబాల రాజేష్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ తీవ్రంగా ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు.

బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన బడికల శ్రావణ్.. బ్లూఫిలిం కేసు, మహిళలను ఎరచూపి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న కుంబాల రాజేష్‌కు తనను విమర్శించే నైతిక హక్కు లేదని ఆరోపించారు. తనపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు.

హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ ఇంజినీరింగ్ అడ్మిషన్ల ద్వారా జీవనం సాగిస్తున్నానని, ఎవరి వద్దా అక్రమంగా డబ్బులు తీసుకోలేదని శ్రావణ్ స్పష్టం చేశారు. రాజేష్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసురుతూ, లేకపోతే తప్పుడు ప్రచారంపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

బీఆర్ఎస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా అనేక మంది పేద విద్యార్థులకు విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఇప్పించి సహాయం చేశానని శ్రావణ్ తెలిపారు. కుంబాల రాజేష్‌కు సంబంధించిన విషయాలను వారానికి ఒకసారి బులెటిన్ రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తానని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story