Kagaznagar: కాగజ్‌నగర్‌లో రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ!

Kagaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో రిటైర్డ్ టీచర్ తాటి రవీందర్ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారం అపహరణకు గురైంది.

LALITH KUMAR, SIRPUR
Published on: 6 Oct 2026 1:54 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్‌నగర్‌లో రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ!

Kagaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్ శివాజీ చౌక్, పోస్టాఫీస్ పక్కన రిటైర్డ్ టీచర్ తాటి రవీందర్ ఇంట్లో చోరీ జరిగింది. గత వారం రోజులుగా ఇంటి యజమానులు ఆరోగ్యం బాగాలేక కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటికి పనిమనిషి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాల కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బాధితుడు తాటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం తులం బంగారు గొలుసు, అర తులం బంగారు కొమ్మలు చోరీకి గురైనట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR