Bejjur: బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో జ్యోతిబా ఫూలే వర్ధంతి ర్యాలీ!
Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
Bejjur: బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో జ్యోతిబా ఫూలే వర్ధంతి ర్యాలీ!
Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే 136వ వర్ధంతి వేడుకలను మాలి సంఘం మండల అధ్యక్షులు ఆదే అశోక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
చింతలమానేపల్లి మండలంలోని ధరంపల్లి డబ్బా బారేగుడ గ్రామాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
బెజ్జూర్ మండల కేంద్రంలో మాలి సంఘం భవనం నుంచి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాల వరకు బారిగా కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది.
ఈ ర్యాలీలో మాలి సంఘం పెద్దలు, యువకులు, కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
సమాజంలో విద్య సమానత్వం మహిళా సాధికారత, కులవివక్ష నిర్మూలన కోసం జ్యోతిబాపూలే చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు.
మహాత్మా జ్యోతిబాపూలే చూపిన సామాజిక మార్గం సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, ఆయన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.




