Mancherial: శ్రీరాంపూర్ ఆర్కే-5 గనిలో ఫైవ్ స్టార్ రేటింగ్ తనిఖీలు!

Mancherial: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే-5 గనిలో ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం సీసీఓ ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 17 Nov 2026 11:06 AM IST
Mancherial
X

Mancherial: శ్రీరాంపూర్ ఆర్కే-5 గనిలో ఫైవ్ స్టార్ రేటింగ్ తనిఖీలు!

Mancherial: శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి గనుల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధనే లక్ష్యంగా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్కే-5 గనిలో సీసీఓ (CCO) విభాగానికి చెందిన ప్రత్యేక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది.

ఈ తనిఖీ బృందంలో పండిట్, మోహన్‌రావు, కృష్ణమోహన్, శ్రీధర్‌రావు, రఘుకుమార్ సభ్యులుగా పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గనిలో భద్రత, ఉత్పత్తి, పర్యావరణం, సాంకేతికత తదితర సుమారు ఏడు విభాగాలకు సంబంధించిన ఆన్‌లైన్ నివేదికలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రికార్డులను తనిఖీ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి మూల్యాంకన ప్రక్రియ నిర్వహించింది.

గత రెండేళ్లుగా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది కూడా ఆర్కే-5, ఆర్కే న్యూ టెక్ గనులతో పాటు శ్రీరాంపూర్ ఏరియాలోని ఇతర నడుస్తున్న గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

ఈ సందర్భంగా గనుల్లో నిరంతరం శ్రమిస్తూ, ఫైవ్ స్టార్ రేటింగ్ సాధనకు కృషి చేస్తున్న కార్మికులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అభినందించారు. కార్మికుల కృషి, అంకితభావం వల్లే గనులు మెరుగైన గుర్తింపు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా అన్ని గనులు ఉత్తమ రేటింగ్ సాధించేలా సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.