Mancherial: ప్రతి ఇంటికి ఇంకుడు గుంత అవసరం: శాస్త్రవేత్త రాంబాబు!

Mancherial: మంచిర్యాల జిల్లా ఇందారంలో భూగర్భ జల సంరక్షణ పనులను పరిశీలించిన కేంద్ర శాస్త్రవేత్త రాంబాబు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపు.

RAJENDER, CHENNUR
Published on: 18 Sept 2026 6:24 PM IST
Mancherial
X

Mancherial: ప్రతి ఇంటికి ఇంకుడు గుంత అవసరం: శాస్త్రవేత్త రాంబాబు!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీ పరిధిలో ఎంజిఎన్ఆర్జిఎస్/వి బి జి రాంజీ పథకాల ద్వారా చేపడుతున్న భూగర్భ జల సంరక్ష పనులను సెంట్రల్ భూగర్భ జలాల శాఖ శాస్త్రవేత్త రాంబాబు పరిశీలించడం జరిగింది.

గ్రామంలో వివిధ రకాలుగా భూగర్భ జలాలను సంరక్షించే విధానంను సెంట్రల్ భూగర్భ జలాల శాఖ శాస్త్రవేత్త రాంబాబు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో ఇంకుడు గుంతల నిర్మాణాలను పెంచాలని, ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు.

మరింతగా ఫారం పాండ్, పార్కులేషన్ ట్యాంక్ లు, ఇంకుడు గుంతలు, ట్రెంచ్లు నిర్మాణం చేపట్టాలని అధికారులకు, ఇందారం గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపూరావు, స్థానిక సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉప సర్పంచ్ ఎల్కటూరి శివ, ఏ పీ డి శ్రీనివాస్, ఏ పీ ఓ బాలయ్య , ఈసీ రాజమౌళి, సదానందం ఏపీ డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, టెక్నికల్ అసిస్టెంట్ తిరుపతి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR