Asifabad: పోలీసుల మెరుపు దాడులు.. 3 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం!
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా చేడువాయిలో గుడుంబాపై పోలీసుల దాడులు. 3,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, 10 లీటర్ల గుడుంబా స్వాధీనం. ఒకరిపై కేసు నమోదు.
Asifabad: పోలీసుల మెరుపు దాడులు.. 3 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం చేడువాయి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎస్ఐ ఎం. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 10 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 3,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఘటనకు సంబంధించి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నిషేధిత గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు.
ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




