Chennur: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

Chennur: చెన్నూర్ మార్వాడి ఫంక్షన్ హాల్‌లో గణేష్ చవితి పురస్కరించుకుని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 4 Sept 2026 11:46 PM IST
Chennur
X

Chennur: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

చెన్నూరు: చెన్నూరు మండలంలోని సర్పంచ్లు ,కౌన్సిలర్స్ , గణేష్ మండపాల నిర్వాహకులు , శాంతి కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలి. రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని చెన్నూర్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం మార్వాడి ఫంక్షన్ హాల్ యందు నిర్వహించారు.

ఈ సమావేశానికి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ హాజరై గణేష్ ఉత్సవాల నిర్వహణ , భద్రతా ఏర్పాట్లు , శాంతిభద్రతలు , ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై మున్సిపల్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ఫైర్ శాఖ అధికారులతో కలసి శాంతి కమిటీ సభ్యులు , గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన , సోదరభావంతో కూడిన శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ అనేది ప్రజలందరినీ ఐక్యం చేసే కార్యక్రమమని , ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు.

గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవడంతో పాటు , పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మండపాల వద్ద భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు , అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మండపాల వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ , పార్కింగ్ , జనసందోహం నియంత్రణకు నిర్వాహకులు ప్రత్యేకంగా సహకరించాలని తెలిపారు. మండపాల వద్ద డీజేలు , సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితులు , సమయ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కూడా నిర్వాహకులు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ముందుగా నిర్ణయించిన మార్గాలు , సమయాలను పాటించాలని సూచించారు.

నిమజ్జన ఊరేగింపులో పాల్గొనే వారు ఎలాంటి రెచ్చగొట్టే నినాదాలు , వివాదాస్పద చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు , వదంతులను నమ్మవద్దని , ఏదైనా అనుమానాస్పద సమాచారం లేదా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు.

ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని , గణేష్ ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా , సురక్షితంగా , విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలు చేపడుతుందనిl తెలిపారు.

ఈ సందర్భంగా శాంతి కమిటీ సభ్యులు , గణేష్ మండపాల నిర్వాహకులు , ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించి మత సామరస్యాన్ని , శాంతిభద్రతలను కాపాడుతూ గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఏసీపీ ఆకాంక్షించారు. అనంతరం, గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని ఇతర శాఖ అధికారులతో, చైర్మన్ లతో కలసి పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కమీషనర్, కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గణేష్ మండలి నిర్వాహకులు , ఆర్గనైజర్లు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ శాంతి కమిటీ సమావేశం చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది భూమన్న, ఖదీర్, దుర్గయ్య, లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story