Mancherial: చెన్నూరు సీఐ బాన్సీలాల్‌కు ప్రశంసా పత్రం

Mancherial: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న చెన్నూరు సీఐ బాన్సీలాల్. అభినందించిన పోలీస్ సిబ్బంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 15 Aug 2026 11:18 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరు సీఐ బాన్సీలాల్‌కు ప్రశంసా పత్రం

మంచిర్యాల: మంచిర్యాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో చెన్నూరు సీఐ బాన్సీలాల్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

పోలీస్ శాఖలో విధుల పట్ల చూపుతున్న అంకితభావం, వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణతో పాటు సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విధుల్లో సీఐ బాన్సీలాల్ చూపుతున్న నిబద్ధత, అంకితభావం ప్రశంసనీయమని సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రం అందుకోవడంతో పోలీస్ అధికారులు, సిబ్బంది సీఐ బాన్సీలాల్‌ను అభినందించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story