Chennur: చెన్నూర్ కాంగ్రెస్ కొత్త కమిటీల ప్రకటన.. నియామక పత్రాలు అందజేత!

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం, పట్టణ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను ప్రకటించిన అధిష్టానం.

RAJENDER, CHENNUR
Published on: 25 July 2026 6:17 PM IST
Chennur
X

Chennur: చెన్నూర్ కాంగ్రెస్ కొత్త కమిటీల ప్రకటన.. నియామక పత్రాలు అందజేత!

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం మరియు పట్టణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.

ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుల్లూరి లక్ష్మణ్ మంచిర్యాల్ జిల్లా జనరల్ సెక్రటరీ చేతుల మీదుగా నూతన కమిటీలో ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర మైనింగ్ & కార్మిక శాఖ మంత్రి వర్యులు డా. వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.

చెన్నూర్ మండల అధ్యక్షుడుగా బాపాగౌడ్, ఉపాధ్యక్షుడుగా జాడి శ్రావణ్ నూతన కమిటీలో ఎన్నికయ్యారు.

అదేవిధంగా, చెన్నూరు పట్టణ అధ్యక్షుడిగా లింగంపల్లీ మహేష్ మరియు నూతన ఎన్నికైన ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, స్పోక్ పర్సన్, కోశాధికారులుగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నియామక పత్రాలను అందజేశారు.

తమపై ఎంతో నమ్మకంతో తమకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంతో నిర్వహిస్తామని, నూతన కమిటీలో తమకు అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి, మంచిర్యాల జిల్లా నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story