Chennur: చెన్నూరులో కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ ప్రారంభం
Chennur: చెన్నూరులో కాకా ఫౌండేషన్ ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ వంశీ తీవ్ర ఆగ్రహం.
Chennur: చెన్నూరులో కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ ప్రారంభం
చెన్నూరు: చెన్నూరు పట్టణంలోని మహిళా భవన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక గనుల మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా కాకా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ.
చెన్నూరు నియోజకవర్గం లోని విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సాధించాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాశం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
స్థానిక విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి వివేక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ వంశీకృష్ణ...!
కేటీఆర్ తన పిల్లలను మాత్రం అమెరికా వెళ్లి చదువుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు మాత్రం విదేశాలకు వెళ్లి చదువు కోవదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జర్మనీ, జపాన్ భాషను నేర్పించి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నరని తెలిపారు.
కేటీఆర్ కూతురు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళితే, తన ట్విట్టర్ల ఖాతాలో పోస్ట్ చేసిన కేటీఆర్, తెలంగాణలోని విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రం విదేశీ భాషలు నేర్చుకొని ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగుల కోసం వెళ్లొద్దా అని మండిపడ్డారు.
కేటీఆర్ తెలంగాణలోని విద్యార్థిని, విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టేలా మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగులు కేటీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని, కేటీఆర్ మాటలు నమ్మితే అనవసరంగా కేసుల భారిన పడుతారు కానీ ఉన్నత చదువులు, ఉద్యోగాలు రావని ఎద్దేవా చేశారు.
రాజకీయాలను విద్యార్థులకు వృద్ధాలని కేటీఆర్ చూస్తున్నారని విద్యార్థులు అవన్నీ గ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు రావాలంటే ఎంతో కష్టపడి చదువుకోవాలని సూచించారు.




