Chennur: చెన్నూర్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ

Chennur: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు, ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు.

RAJENDER, CHENNUR
Published on: 26 Oct 2026 7:30 PM IST
Chennur
X

Chennur: చెన్నూర్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ

మంచిర్యాల జిల్లా: పోలీస్ అమరవీరుల త్యాగలను స్మరించుకుంటూ ఈరోజు చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద చెన్నూర్ పట్టణ పోలీస్ మరియు పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించిన చెన్నూర్ ప్రజలు. పోలీస్ అమరవీరుల త్యాగలను పాటల రూపంలో గుర్తు చేసిన పోలీస్ కళాబృందాలు కళా ప్రదర్శన రూపకంలో చూపించారు.

1959 సంవత్సరం అక్టోబర్ 21 న చైనా వారి దుష్చర్యలో భాగంగా లడక్ లో ప్రాణాలు అర్పించిన CRPF జవానుల స్మారకర్థం పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరుపుతూ అదేవిదంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన ఎంతో మంది పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతుంది.

చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక ప్రజలు పిల్లలతో కలసి కొవ్వొత్తులు వెలిగించి అమరులైన పోలీస్ అమరవీరులు వారి ఆత్మలకు శాంతి కలగాలని ఘనంగా పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన చెన్నూర్ పట్టణ పోలీసులు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR