Mancherial: చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం!

Mancherial: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పిఎస్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 27 Oct 2026 1:45 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం!

Mancherial: చెన్నూర్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, కేసుల దర్యాప్తు ప్రక్రియతో పాటు పలు కీలక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి సేవలను వివరించి పోలీస్ సేవలో అమరులైన వారికి నివాళి అర్పించారు.

పోలీసు వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకున్న విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, పోలీస్ స్టేషన్ ఆవరణం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పోలీస్ స్టేషన్ లోని సేవలు, పోలీసులు వాడే ఆయుధాలు, పోలీసుల విధులు, వారి సేవలు, వంటి పలు అంశాలపై విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR