Chennur: చెన్నూరులో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన సదస్సు!

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పాఠశాలల విద్యార్థులకు శుక్రవారం చెన్నూరు పోలీసులు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 20 Nov 2026 4:45 PM IST
Chennur
X

Chennur: చెన్నూరులో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన సదస్సు!

మంచిర్యాల జిల్లా: చెన్నూరు పట్టణంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సులు నిర్వహించిన చెన్నూరు పోలీసులు. పట్టణంలోని స్థానిక పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వాడటం వల్ల కలిగే అనర్ధాలు దుష్పరిణామాలతో వివరించారు.

కార్యక్రమానికి వచ్చిన పాఠశాలల విద్యార్థులతో బ్లాక్ మ్యాజిక్ పై ఉన్న మూఢనమ్మకాల పై నిపుణులతో విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రాక్టికల్ మ్యాజిక్ రూపకంగా చేసి చూపించి అవగాహన కల్పించారు.

అలాగే మహిళా చట్టాలు, సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు, వాహనాలు జరుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలు వంటి పలు అంశాల పై పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థి దశ నుండి డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడం వల్ల వారికి మాదిగ ద్రవ్యాల వాడకం వల్ల ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించడం వల్ల మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎంతో సహాయపడుతుందని పోలీసులు తెలిపారు.

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థిని విద్యార్థులకు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ రాయిస్తా తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడుతూ కృషి చేయాలని సూచించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR