Chennur: చెన్నూర్ అస్నాద్ చౌరస్తా వద్ద గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూర్ అస్నాద్ ఎక్స్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. మహారాష్ట్ర నుంచి వేములవాడకు బైక్‌పై తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు.

RAJENDER, CHENNUR
Published on: 11 Sept 2026 10:05 PM IST
Chennur
X

Chennur: చెన్నూర్ అస్నాద్ చౌరస్తా వద్ద గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!

చెన్నూర్: చెన్నూర్ పట్టణ సమీపంలోని 63వ జాతీయ రహదారిపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా తొడ్సీ గ్రామం నుంచి వేములవాడకు నెంబర్ ప్లేట్ లేని KTM బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద 1 కిలో 20 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్, రూ. 2000/- నగదు, బైక్, ఎటిఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.15,000/- ఉంటుందని పోలీసులు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న యువకులను విచారించగా, వీరు గత సంవత్సర కాలంగా గంజాయి త్రాగుటకు అలవాటు పడి మహారాష్ట్రలోని తొడ్స గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అందులో కొంత సేవించి మిగతా గంజాయి ని వేములవాడ పరిసర ప్రాంతంలోని యువకులకు ఎక్కువ ధరకు అమ్మి డబ్బులు సంపాదిస్తూ వచ్చిన డబ్బుతో మళ్లీ గంజాయి కొనుగోలు చేయటం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న రూ.4,000/- తో గంజాయి కొనుగోలు చేసి వేములవాడ కు తరలిస్తుండగా రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు చెన్నూర్ పట్టణ సీఐ మరియు ఎస్ ఐ పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. త్వరలోనే తోడ్స గ్రామంలో ని వ్యక్తి ని పట్టుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి సేవించిన, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR