Mancherial: అనాథ మహిళకు అంత్యక్రియలు.. మానవత్వం చాటిన పోలీసులు!
Mancherial: చెన్నూరులో మృతి చెందిన గుర్తు తెలియని అనాథ మహిళకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
Mancherial: అనాథ మహిళకు అంత్యక్రియలు.. మానవత్వం చాటిన పోలీసులు!
Mancherial: చెన్నూరు పట్టణంలో మతి స్థిమితం లేని అనాధ మహిళా శవాన్ని ఖననం చేసి మానవత్వం చాటుకున్న చెన్నూర్ పోలీసులు. తేది 07-09-2026 న రాత్రి సమయంలో గుర్తు తెలియని, మతిస్థిమితం లేని సుమారు 40 సం,, ల వయస్సు గల అనాధ మహిళ చెన్నూర్ బస్ స్టాండ్ సమీపంలో మృతి చెందింది.
అనాధ మహిళ అనారోగ్య కారణంగా మృతి చెందిందన్న సమాచారం మేరకు చెన్నూర్ పట్టణ సీఐ తమ పోలీస్ సిబ్బంది మరియు స్థానిక అంబులెన్సు వారి సహకారంతో రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి మార్చురీ గది నందు రాత్రి భద్రపరిచారు.
మరుసటి రోజు చనిపోయిన అనాధ మహిళ శవానికి పంచనామా నిర్వహించి చెన్నూర్ మునిసిపల్ సిబ్బంది సహకారంతో తమ పోలీస్ సిబ్బంది శంకర్, బీమేష్, సాయి, రాజయ్య లను మహిళ శవాన్ని ఖననం చేయుటకు పూర్మాయించగా పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది అట్టి మహిళ శవాన్ని గోదావరి ఒడ్డున గుంట తవ్వి ఖననం చేయించడం జరిగినది.
అందుకు సహకరించిన మున్సిపల్ సిబ్బందిని, అంబులెన్సు వారిని మరియు పోలీస్ సిబ్బందిని చెన్నూర్ పట్టణ సీఐ బన్సిలర్ అభినందించి, కృతజ్ఞతలు తెలియజేసారు. సహాయక కార్యక్రమాలు చేపట్టడంలో చెన్నూర్ పోలీసులు ఎప్పటికి ముందు ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు.




