Kagaznagar: భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛట్ పూజలు.. సూర్యుడికి అర్ఘ్యం!
Kagaznagar: కాగజ్‌నగర్‌లో ఛట్ పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉత్తర భారతీయులు 36 గంటల నిర్జల ఉపవాస దీక్షతో అస్తమించే, ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kagaznagar: భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛట్ పూజలు.. సూర్యుడికి అర్ఘ్యం!
Kagaznagar: కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఛట్ పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మినీ ఇండియాగా పేరొందిన కాగజ్‌నగర్‌లో స్థిరపడిన బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్తర భారతీయులు తమ సంప్రదాయ ఆచారాల ప్రకారం ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ భక్తులు 36 గంటల పాటు నిర్జల ఉపవాస దీక్ష చేపట్టారు. ఛట్ పూజలో భాగంగా అస్తమించే, ఉదయించే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం జేకే పేపర్ మిల్లు యాజమాన్యం ఎస్పీఎం నీటి కొలను వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.




