Asifabad: చింతలమానేపల్లిలో ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో డీఏవో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Asifabad: చింతలమానేపల్లిలో ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ!
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) గఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయాలు, స్టాక్ వివరాలు మరియు రైతులకు ఎరువుల సరఫరా తీరును పరిశీలించారు. రైతులకు ఎరువులను నిబంధనల ప్రకారం అందించాలని, ఎలాంటి అక్రమ నిల్వలు లేదా అధిక ధరలకు విక్రయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దుకాణదారులకు సూచించారు.
అనంతరం మండలంలో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమంలో DAO గారు పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. రైతుల పంట వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వేను ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేయాలని, ప్రతి రైతు పంట వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే.కార్తీష వ్యవసాయ విస్తరణ అధికారీ డి.శ్రీలత మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.




