Chintalamanepally: చింతలమానేపల్లిలో ఈజీఎస్ టీఏలకు వీడ్కోలు, స్వాగతం!

Chintalamanepally: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు అరుణకు వీడ్కోలు, లావణ్యకు ఘన స్వాగతం పలికారు.

SRINIVAS, KOUTALA
Published on: 11 Nov 2026 9:48 PM IST
Chintalamanepally
X

Chintalamanepally: చింతలమానేపల్లిలో ఈజీఎస్ టీఏలకు వీడ్కోలు, స్వాగతం!

చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లకు అధికారులు ఘనంగా వీడ్కోలు, స్వాగతం పలికారు. చింతలమానేపల్లి మండలంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్ గా గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వర్తించి, బదిలీపై వెళుతున్న అరుణ కి ఘనంగా వీడ్కోలు పలికారు. MPDO సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో APO, ECలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

అరుణ మండలంలో ఉపాధి హామీ పనుల్లో చూపిన అంకితభావాన్ని, పంచాయతీల అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా ఎంపిడిఓ సత్యనారాయణ అధికారులు కొనియాడారు. శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. అనంతరం మండలంలో నూతనంగా ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గా బాధ్యతలు స్వీకరించిన లావణ్య కి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా MPDO సత్యనారాయణ మాట్లాడుతూ. బదిలీ అనేది ప్రభుత్వ ఉద్యోగంలో సహజమని, వెళ్లే చోట కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని అరుణ కి సూచించారు. నూతనంగా వచ్చిన లావణ్య కూడా మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల apo టెక్నికల్ అసిస్డెంట్ లు కార్యదర్శులు సిబ్బంది అంతా పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA