Asifabad: వంజరి సమీక్షలో కలెక్టర్ కె. హరిత కఠిన మార్గదర్శకాలు!
Asifabad: ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో జలసిరి పనులు పెంచాలని, ఆగస్టు 15 లోగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టాలని ఆదేశించారు.
Asifabad: వంజరి సమీక్షలో కలెక్టర్ కె. హరిత కఠిన మార్గదర్శకాలు!
కగజనగర్: కొమరం భీం జిల్లాలో ఎల్ నినో ప్రభావం కారణంగా లోటు వర్షపాతం ఉందని, భూగర్భ జలానికి మట్టాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.కాగజ్ నగర్ మండలం వంజరి రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తో కలిసి హాజరై సెర్ప్ ఎ పి ఎం లు, సి సి లు, వి ఓ లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ నీటి మట్టాన్ని పెంపొందించేందుకు సామాజిక ఇంకుడు గుంతలు, ఫారం పాండ్, నీటి కుంటలు, పంట కుంటలు, ఊట కుంటల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరి క్రింద వి బి జి రామ్ జి పథకం ద్వారా భూగర్భ జల నీటిమట్టాన్ని పెంపొందించే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకించాలని, ఆ దిశగా స్వయం సహాయక సంఘాల సభ్యులు భాగస్వామ్యులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కరువు పరిస్థితులను ఎదుర్కోవాలంటే భూమి నీటిమట్టాన్ని పెంచడమే మార్గమని, వి బి జి రామ్ జి పథకం ద్వారా అర్హులైన కూలీలకు 125 రోజుల పని దినాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు ఆగస్టు 15వ తేదీలోగా అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని, కుట్టు మిషన్ల సంఖ్య పెంచాలని, ఏకరూప దుస్తులు కుట్టే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తెలిపారు.
ప్రతి వి. ఓ. క్రింద 15 స్వయం సహాయక సంఘాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నూతన సంఘాలు ఏర్పాటుచేసి సంఘాలలో నమోదు కాని వారిని గుర్తించి సభ్యులుగా చేర్పించాలని తెలిపారు. అంతకుముందు రైతు వేదిక ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.




