Bellampalli: బెల్లంపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కలెక్టర్ కుమార్ దీపక్ యాక్షన్

Bellampalli: పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు సంయుక్తంగా పరిశీలించారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 19 Jun 2026 4:06 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కలెక్టర్ కుమార్ దీపక్ యాక్షన్

బెల్లంపల్లి: పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి. శ్రీ. దావ స్వాతి-రమేష్ బాబు గారు..మరియు జిల్లా కలెక్టర్ శ్రీ. కుమార్ దీపక్ గారు..

ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించినప్పటికీ ఇంకా పనులు పూర్తి కాలేదని సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఇండ్లను పరిశీలించడం జరిగిందన్నారు.

లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందించేందుకు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను వెంటనే వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, తహసీల్దార్ శ్రీ.కృష్ణ గారు , మున్సిపల్ కమిషనర్ శ్రీ. తన్నీరు రమేష్ గారు పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story