Mancherial: బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Mancherial: బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 18 Oct 2026 6:54 PM IST
Mancherial
X

Mancherial: బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Mancherial: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించిన కలెక్టర్.. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, వ్యాధుల వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు.

పండుగల సమయంలోనూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యులు ప్రతిరోజూ విధులకు హాజరై అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎమర్జెన్సీ వార్డును నిరంతరం అందుబాటులో ఉంచాలని, కనీసం ఒక వైద్యుడు విధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆసుపత్రి పరిసరాలను కూడా పరిశీలించిన కలెక్టర్.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.