Mancherial: ఇందారంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ కుమార్ దీపక్, ఏసీపీ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Mancherial: ఇందారంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ప్రాంతంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీసు బందోబస్తు కొనసాగించాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మొత్తం ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు..




