Mancherial: మంచిర్యాల, దండేపల్లి, లక్షెట్టిపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Mancherial: మంచిర్యాల, దండేపల్లి, లక్షెట్టిపేటలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ విగ్రహాలకు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Oct 2026 3:30 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల, దండేపల్లి, లక్షెట్టిపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Mancherial: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు ఘనంగా నివాళులర్పించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీ పార్క్‌తో పాటు దండేపల్లి, లక్షెట్టిపేట మండల కేంద్రాల్లోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.