Mancherial: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా స్వీయ రక్షణే మార్గం డీసీపీ!
Mancherial: గురుకులంలో 'సురక్ష తిరంగా' కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై విద్యార్థినులకు డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్ అవగాహన కల్పించారు.
Mancherial: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా స్వీయ రక్షణే మార్గం డీసీపీ!
మంచిర్యాల: సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంచిర్యాల డీసీపీ శ్రీ ఎగ్గడి భాస్కర్ మరియు జైపూర్ ఏసీపీ శ్రీ ఆరె వెంకటేశ్వర్ లకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థినులు. అనంతరం విద్యార్థినులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించిన డీసీపీ భాస్కర్.
చెన్నూర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సురక్ష తిరంగా కార్యక్రమం లో భాగంగా పాఠశాల మరియు విద్యార్థినులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో విద్యార్థినులకు మంచిర్యాల డీసీపీ , జైపూర్ ఏసీపీ మరియు రామగుండం పోలీస్ సైబర్ వారియర్స్ టీం ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సైబర్ నేరలపట్ల అవగాహన కల్పించినారు.
ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ శత్రువుల నుండి దేశాన్ని కాపాడే బాధ్యత ఆర్మీ వారిది, అంతర్గతంగా రక్షించే భాద్యత పోలీస్ వారిది అయితే వ్యక్తిగతంగా తమను తాము సైబర్ నేరస్థుల భారీ నుండి రక్షించుకునే భాద్యత ప్రజలదే అని తెలిపినారు. ఈరోజుల్లో అంతర్జాతీయంగా సైబర్ నేరాలు తీవ్రంగా పెరుగుచున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరస్థుల భారిన పడి తమ విలువైన డబ్బును పోగుట్టుకోకుండా ఉండాలంటే అప్రమత్తత చాలా అవసరం.
సైబర్ నేరగాళ్ళు ఎన్నో విధాలుగా ప్రజలను మోసం చేసి, భయబ్రాంతులకు గురిచేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అందువలన నేరాలు తీవ్రంగా పెరగడమే గాక దేశ ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది, దానికి పరిష్కారం మార్గం స్వీయ రక్షణ మాత్రమే అని తెలిపారు. ప్రజలు అత్యాశకు వెళ్లి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ విలువైన డబ్బు పోగొట్టుకోవడమే గాక, మనః శాంతి ని కోల్పోతున్నారని తెలియజేశారు.
విద్యార్థులు మొబైల్ ఫోన్స్ ను తమ అవసర నిమిత్తం మాత్రమే ఉపయోగించాలని, అనవసరమైన యాప్ లు, వీడియో గేమ్ లు, ఇంస్టాగ్రామ్ లాంటి వాటిని ఉపయోగించడం వల్ల సైబర్ నేరగాళ్ళు వాటి మాటున దాగి అమ్మాయిలను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ళు డబ్బు ఆశ చూపి ప్రజల వద్ద నుండి వారి విలువైన సమాచారం సేకరించి వారి విలువైన ధనాన్ని కాజేస్తున్నారు.
కావున ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, మన మొబైల్ ఫోన్స్ ఆధార్ కార్డు తో అనుసంధానమై ఉంటుంది, బ్యాంకు ఖాతా కు సంబంధించి అన్నీ ట్రాన్సక్షన్స్ ఫోన్ తోనే లింక్ అయ్యి ఉంటాయి కావున వైబర్ నేరగాళ్ళు మొబైల్ ఫోన్స్ పంపే సందేశాలు, కాల్స్, లింక్స్ ఆధారంగా నేరాలకు పాల్పడుతున్నారు, కావున అపరిచితులు మొబైల్ ఫోన్స్ ద్వారా అడిగే ఏ సమాచారం కూడా ఇవ్వకూడదని తెలిపారు.
విద్యార్థినులు తమ తల్లిదండ్రుల ఉన్నత ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి భవిషత్తులో ఉన్నతంగా స్థిరపడాలి, తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇతరత్ర అంశాలపై దృష్టి మరల్చవద్దని కోరారు. ఈ కార్యక్రమం లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ ఐ లు శ్యాంపటేల్, రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.




