Chennur: చెన్నూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీల ధర్నా

Chennur: చెన్నూర్ మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు పునరుద్ధరించాలని, పని దినాలు 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 26 Oct 2026 4:57 PM IST
Chennur
X

Chennur: చెన్నూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీల ధర్నా

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ మున్సిపాలిటీలో ఉపాధి హామీ పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పైళ్ల ఆశయ మాట్లాడుతూ....! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ చెన్నూర, గతంలో గ్రామ పంచాయతీగా ఉండేది ఇందులో ఉపాధి హామీ పని కల్పించబడింది. అప్పుడు సుమారు 3 వేల జాబ్ కార్డ్స్ ఉండేవి కానీ ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత ఉపాధి హామీ పని రద్దు చేసారు.

చెన్నూర్ మున్సిపాలిటీలో అత్యధిక పేదలు నివసించే కాలనీలు గణనీయంగా ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, బి.సి లు వెనకబడిన కులాలు గణనీయంగా కూలీ పనిపై ఆధారపడి బతుకుతున్నారు. వారందరికీ గ్రామీణ ఉపాధి హామీ పని ఎత్తివేసారు. దీనివలన చేయడానికి పని లేక పేదలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. నిత్యవసర ధరలు ఇంటి కిరాయిలు, విద్యా, వైద్యం ఖర్చులు పెరిగి పేదలు పతమతం అవుతున్నారు.

కావున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణ ప్రాంతలలో ఉపాధి పని కల్పించాలని, పని దినాలను 200 రోజులకు పెంచాలని రోజు వేతనం 800 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిపారు.

గత కేంద్ర ప్రభుత్వం పేదలకు పని కల్పించాలని మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్రం లో ఉన్న బిజేపి గవర్నమెంట్ ఉపాధి హామీ పనిని ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో బాగంగానే 90 శాతం నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా మహాత్మ గాంధీ పేరు మార్చి వి.బి.జి రాంజీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేసి 40 శాతం నిధులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుంది. దీనితో పేదలకు పని కల్పించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.

చెన్నూర్ మున్సిపాలిటీలో పెద ప్రజలందరికీ ఉపాధి హామీ పని కలిగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 నుండి 25/10/2026 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. 26/10/2026 న ఎంపీడీవో ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పైల్ల ఆశయ, మంచిర్యాల జిల్లా కార్యదర్శి కనికారపు అశోక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు, cituc కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్, చెన్నూరు మండలం కార్యదర్శి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR