Asifabad: కర్జవెల్లిలో నిధుల దుర్వినియోగంపై వేగవంతమైన విచారణ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కర్జవెల్లి గ్రామంలో నిధుల దుర్వినియోగంపై విచారణ వేగవంతం చేసిన DLPO హరిప్రసాద్. రికార్డులను పరిశీలించి అధికారుల విచారణ.
Asifabad: కర్జవెల్లిలో నిధుల దుర్వినియోగంపై వేగవంతమైన విచారణ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై విచారణ వేగవంతం అయింది. గ్రామ పంచాయతీకి రావాల్సిన ప్రభుత్వ నిధులు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మళ్లించారనే తీవ్ర ఆరోపణలపై పంచాయతీ రాజ్ శాఖ సీరియస్ అయింది.
దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ (DLPO) హరిప్రసాద్ స్వయంగా కర్జవెల్లి గ్రామాన్ని సందర్శించి సమగ్ర విచారణ చేపట్టారు.
గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న DLPO హరిప్రసాద్ గత కొన్ని నెలలుగా జరిగిన ఆర్థిక లావాదేవీలు, క్యాష్ బుక్స్, వౌచర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిధులు ఏయే పనులకు మంజూరయ్యాయి ఎవరి ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయి? దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో అధికారులను సిబ్బందిని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా DLPO హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరమని విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులైన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పూర్తి స్థాయి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




